రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి... రామన్న పల్లి తండా సర్పంచ్ కే కే వెంకట్ బాయ్ ....

రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి... రామన్న పల్లి తండా సర్పంచ్ కే కే వెంకట్ బాయ్ ....    కోయిలకొండ: మండలంలో ఉన్న వింజమూరు గ్రామ పంచాయతీ నుంచి రామన్న పల్లి తండా గ్రామపంచాయతీ వరకు ఆగి ఉన్న బిటి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని రామన్న పల్లి తండా సర్పంచ్ కేకే వెంకట్ బాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరం నుంచి బీటీ రోడ్డు పనులు ఆగిపోవడంతో గిరిజనులు తాండ కురావాలంటేభయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రోడ్డుపైన కంకర వేయడంతో వచ్చే వాహనాలకు ఇబ్బందికరంగా ఉందని తెలియజేశారు.  రోడ్డుపై కంకర ఉన్నందువలన వచ్చిపోయే బైకులు అదుపుతప్పి కింద పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు .సంబంధిత అధికారులు స్పందించి రామన్న పల్లి  రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు . గ్రామపంచాయతీ లో ఉన్న గిరిజనుల అభివృద్ధికి సహకరించాలని ఆయన తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి, గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు.