రోడ్డు మధ్యలో ఉన్న స్తంభం తోలగించండి.... మున్సిపల్ పరిధిలో రహదారి మార్గం మద్య లో విద్యుత్ స్థంభం ...

రోడ్డు మధ్యలో ఉన్న స్తంభం తోలగించండి మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని ధనలక్ష్మి కాలనీలో రహదారి మార్గం మద్య లో విద్యుత్ స్థంభం ఉండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏదరువుతున్నాయి. ఈ దారిలో ఇరువైపులా గుంతలు ముల్లపోదలు ఉండటంతో నడవటానికి వీలులేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు మద్యలో ఉన్న స్థంభం తొలగిస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుందని కాలనీ వాసులు అంటున్నారు. 9వార్డులోని విద్యుత్ స్థంభంతో కలిగే అసౌకర్యం పరిష్కారం కోసం గతంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామని చర్యలు తీసుకోలేదని కాలనీ ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.