ఆర్కే న్యూస్ నూతన లోగోను ఆవిష్కరించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు
ఆర్కే న్యూస్ నూతన లోగోను ఆవిష్కరించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు
ఆర్కే న్యూస్ ఛానెల్ నూతన టెక్నాలజీతో అత్యాధునిక హంగులతో ముందుకు రావడం సంతోషకరమని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు .ఆర్కే న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన లేటెస్ట్ లోగో ను ఆయన ఆవిష్కరించారు.
ఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మొదటిసారిగా వెలువడిన విప్లవ నామసంవత్సర పంచాంగ శ్రవణ పుస్తకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ చానెళ్లు, పత్రికలు సమాజ శ్రేయస్సుకై పాటు పడాలని సూచించారు. అదేవిధంగా ఆర్కే న్యూస్ ఛానల్ సమాజంలో జరిగే అక్రమాలను అన్యాయాలను తెరమీదకు తీసుకువచ్చి పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ప్రజలను చైతన్యవంతులుగా తయారుచేయడానికి మీడియా ముందు ఉండాలని తెలిపారు.ఫోర్త్ ఎస్టేట్ మీడియా సమాజంలో నిష్పక్షపాతంగా పనిచేస్తూ సమాజ హితం కోసం పని చేయాలని సూచించారు .ఆర్కే న్యూస్ గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కూడా ప్రస్తుతం నూతన టెక్నాలజీతో నూతన ఒరవడితో నూతన లోగోను తన చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు.ఆర్కే న్యూస్ ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయి చానెళ్లతో సమానంగా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్పి పి ఆర్ ఓ రంగినేని మన్మోహన్, ఆర్కే న్యూస్ చానల్ చైర్మన్ విల్టపురం శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్ ఛానల్ సిబ్బంది ప్రవీణ్ ,సుజాత, జమీల్, ఓం ప్రకాష్ తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ మహబూబ్ నగర్ చైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు.