రెండో దశ కరోనా నిబంధనలు పాటించాలి తాహసిల్దార్ శంకర్

రెండో దశ కరోనా నిబంధనలు పాటించాలి  తాహసిల్దార్ శంకర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్ రెండో దశ నిబంధనలు పూర్తిగా పాటించాల్సిందేనని రాజాపూర్ తాహసిల్దార్ శంకర్ పేర్కొన్నారు. వైరస్ రెండవ దశ లో తీవ్రంగా విజృంభిస్తున్న పరిస్థితి వున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు... మండల లెవెల్, గ్రామ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు.  మండల, గ్రామ స్థాయి టాస్క్ ఫోర్స్ టీమ్ ఉత్తర్వులు,జారీ చేయబడినందున టాస్క్ ఫోర్స్ టీమ్ లు పని చేసి కోవిడ్  నిభందనలు ఉల్లంగించవారి పై కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాసిల్దార్ స్పష్టం చేశారు