రెడ్ క్రాస్ కు ట్రైసైకిళ్లు వితరణ చెసిన హెటిరో సంస్థయాజమాన్యం... అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..
రెడ్ క్రాస్ కు ట్రైసైకిళ్లు వితరణ చెసిన హెటిరో సంస్థయాజమాన్యం... అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ...ఏప్రిల్28 మహబూబ్నగర్ జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడిచే సాందీపని ఆవాశంలో ఉన్న వికలాంగ చిన్నారులకు ప్రముఖ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థ హెటిరో డ్రగ్స్ పది ట్రైసైకిళ్లు బుధవారం అందజేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ట్రై సైకిళ్లు అంతచేసిన హెటిరో యాజమాన్యాన్ని తాను అభినందిస్తున్నానని తెలిపారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీఎస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజు, హెటిరో సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చంద్రారెడ్డి,రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యామ్యూల్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, వైస్ ఛైర్మన్ తాటి గణేష్, పుర కౌన్సిలర్లు హెటిరో సంస్థ సిబ్బంది ఫణీంద్ర, నగేష్ తదితరులు పాల్గొన్నారు.