రికార్డులు పరిశీలించిన ఎంపీడీవో జయరామ్ ...

రికార్డులు పరిశీలించిన ఎంపీడీవో జయరామ్ కోయిలకొండ... మండలంలో ఉన్న నల్లవల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన అభివృద్ధి రికార్డులను ఆదివారం నాడు  ఎంపిడిఓ జయరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ, మండలంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు అభివృద్ధికి సంబంధించిన వివరాలనూ గ్రామపంచాయతీ సంబంధించిన రికార్డుల్లో నమోదు చేయాలని తెలియజేశారు. అదేవిధంగా బూరుగుపల్లి లో ఉన్న నర్సరీని, గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఎంపీడీవో పరిశీలించారు. కరో నా మహమ్మారి ఉన్నందువలన ప్రతి ఒక్కరు మాస్కులు శానిటైజర్ ఉపయోగించుకోవాలని ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో నల్లవల్లి సర్పంచ్ అంజయ్య యాదవ్ , పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.