రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు,, సకాలంలో ఆక్సిజన్ అందక, ప్రాణాపాయ స్థితిలో కరోనా రోగులు, బహుశా ఎన్నికల తర్వాత ప్రజల పై దృష్టి సారిస్తారే మో పాలకులు, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, గెలుపే లక్ష్యంగా,  జన సమీకరణ చేసి, ప్రచారం చేస్తూ,  కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారని.  విపత్కర పరిస్థితుల్లో, హంగు ఆర్భాటాలతో ప్రచారం అవసరమా అని. బీసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బూర్గుపల్లి  కృష్ణ యాదవ్.  గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడి త్య రమేష్ నాయక్ లు మండిపడ్డారు,జడ్చర్ల మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో, ఏర్పాటుచేసిన ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో. బీసీసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బూర్గుపల్లి కృష్ణయాదవ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరమేష్ నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం దేశాన్ని గడగడ లాడించిన కరోనా వైరస్,  దెబ్బకు కోలుకునే లోపే కరోనా వైరస్ రెండోదశ దేశాన్ని గడగడలాడిస్తున్నఉత్తరాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఆంధ్రా లో ఉప ఎన్నికలు,  మున్సిపల్ ఎన్నికలనుదృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కరోన నియంత్రణకు కట్టడి  చేపట్టకుండా ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభ నిర్వహించి, కరోనా వ్యాప్తికి రాజకీయ పార్టీల నాయకులు కారణమయ్యారని మండిపడ్డారు ప్రజల ప్రాణాల కంటే,  ఎన్నికలే ముఖ్యమా  , కరోనా నివారణ పై దృష్టి పెట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడున్నర లక్షలకు పైగా అధికారికంగా కరోన టెస్టులు బయటపడుతున్నా యని,  టెస్టులు చేసుకోని వారు, ఇంకా అధిక సంఖ్యలో ఉంటారని, అన్నారు,మేమే  అభివృద్ధి చేశామంటే కాదు మేమని,  పత్రికా ప్రకటన ల్లో పోటీపడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
గత సంవత్సరం ఇది ఆర్థిక మూలాలను, ప్రజల ప్రాణాలను
 మట్టుబెట్టిన కరోనావైరస్ నుండిపాలకులు గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల, దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో, బెడ్ లు, దొరక క కొందరు.  సకాలంలో ఆక్సిజన్ అందక, కొందరు కరోనా  రోగులు,  ప్రాణాలు కోల్పోతున్నారని
 వారి ని నమ్ముకుని ఉన్న, కుటుంబ సభ్యులు, అనాథలవుతున్న, ప్రభుత్వం, సీరియస్ గా తీసుకోకపోవడం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు, దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో కనీస వసతులు కూడా నేటి వరకు ప్రభుత్వాలు కల్పించకపోవడందారుణమని, అభివృద్ధి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో, జనాలు గుంపులుగా తిరుగుతున్న, ప్రభుత్వ అధికారులు, పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు, ఒక్క రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇల్లిల్లు తిరిగి సకల జనుల సర్వే చేయించిన ప్రభుత్వం, అదే మాదిరిగా, కరోనా టెస్టులుచేయించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.119 నియోజకవర్గాల్లో
 నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలలో బెడ్ ను ఏర్పాటు చేసి, కరోనా రోగులకు చికిత్స అందించాలని,  ప్రైవేట్ హాస్పిటళ్ల 
 యాజమాన్యంతో ప్రభుత్వ సంప్రదించి కరోనా  రోగులకు ఉచిత చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో,  ప్రజా చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడిమింటి శ్రీనివాస్. మండ్ల స్వామి కృష్ణయ్య, రాజు  తదితరులు పాల్గొన్నారు