రాజ్యాంగ విలువలను కాపాడుకుంటేనే అంబేద్కర్ కు ఘనమైన నివాళి..

రాజ్యాంగ విలువలను కాపాడుకుంటేనే అంబేద్కర్ కు ఘనమైన నివాళి...
డా.బి.ఆర్.అంబెడ్కర్ 130 వ జయంతి సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు మహబూబ్ నగర్ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎన్.వెంకటేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రవికుమార్ లు మాట్లాడుతూ ,ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో ఉందని స్వాతంత్రం సిద్దించిన తరువాత భారత దేశంలో అణగారిన వర్గాలకోసమే కాకుండా అన్ని వర్గాలను సమాన స్థాయిలో పరిపాలించే విధంగా మరియు అన్ని రంగాల్లో మహిళా అభ్యున్నతికి తోడ్పడే విధంగా ప్రజల హక్కులను కాపాడాలి అన్నారు .ప్రభుత్వాల భాధ్యతలను నిర్వచిస్తూ  ప్రజా సంక్షేమమే ద్యేయంగా  రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఇప్పుడున్న పాలకులు కార్పొరేట్ల సంక్షేమమే ద్యేయంగా,ఓట్ల కోసమే ప్రజలు ఉన్నట్లు పాలన కొనసాగిస్తున్నారు.ఒక ప్రక్క ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ,బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకు గండి కొడుతున్నారు అన్నారు .మరోపక్క అంబెడ్కర్ జయంతులు, పూలే జయంతులను మాత్రం కపట బుద్ధితో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంలో బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నారు. ప్రభుత్వాల కపట ప్రేమను గుర్తించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.కిష్టయ్య  మాట్లాడుతూ ,ప్రజలు చైతన్యం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందకుండా  చేసున్నారని నూతనజాతీయవిద్యావిధానంలోభాగంగాఆశాస్త్రీయ,చాందసభావాలను,మూఢనమ్మకాలను పెంచే కోర్సులను  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తుందని అన్నారు.అందుకే మన హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతూనే,  రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి అన్నారు. అప్పుడే అంబెడ్కర్ కు ఘనమైన నివాళి అర్పించినట్లు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె.రామదాసు,జిల్లా కార్యదర్శులు భాస్కర్,కాశప్ప,మణ్యం,కనకమ్మ,సుదర్శన్,జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ హేమంత్ కుమార్,వివిధ మండలాల నాయకులు కిష్ట్యానాయక్,జయంతి,శివరాజ్ గౌడ్,వేణుగోపాల్ వర్మ,రాకేష్,రవీంద్రప్ప,శివరాజ్,ఎల్లప్ప,కతలయ్యఖాదరయ్యలు పాల్గొన్నారు.