రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాల ను సాధిస్తాం....
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాల ను సాధిస్తాం....
బాల నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన నాయకులు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 130 వ జయంతిని పురస్కరించుకుని బాలనగర్ అంబేద్కర్ చౌరస్తా లో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భాజపా, అంబేద్కర్ యువజన సంఘం కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా మండలంలోని అన్ని గ్రామాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించి అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారి కోసం చెసిన సేవలను వారు గుర్తు చేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి భారత దేశ ప్రజలకు సర్వసత్తాక సామ్యవాద లౌకిక రాజ్యాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతోమంది ప్రజానీకానికి ఆదర్శప్రాయులు అన్న అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు