రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో రైతులకు అవగోపన సదస్సు...

రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో రైతులకు అవగోపన సదస్సు మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో రైతులకు (DAO) డి ఏ ఓ బోవాల్ల వెంకటేష్  వరి పంటకు ప్రత్యవ్యయ పంటల సాగు పప్పుధాన్యాలు, నూనెగింజలు, బిరుధాన్యాల పంటలసాగు, పాస్పరాస్        సాల్యూబలైజింగ్ బ్యాక్టీరియా వాడకం మట్టినమూనాల సేకరణ ధాన్యం ఆరపబెట్టుకోడానికి  అవసరమైన కళాల నిర్మాణం పై ఆసక్తి చూపలని రైతులకు అవగొపనా కల్పించారు.అదేవిధంగా వివిధ పంటలలొ భాస్వరంను కరిగించే జీవన ఎరువుల వాడకం ప్రయొజనాల గురించి క్లుప్తంగా వివరించారు. రైతులు తమ భూములలో మట్టినమునాను సేకరించి దగ్గర్లో ఉన్న భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించి నెలలోని లభ్య భాస్వరం తెలుసుకోవాలి అలాగే లభ్యభాస్వరం " కిలోల కన్నా తక్కువగా ఉంటే ఆ నెలలో భాస్వరం తక్కువగా ఉన్నట్లు 11-24 కిలోలు ఉంటే మద్యస్తంగాను 24 కిలోల కంటే ఎక్కువ ఉంటే భాస్వరం ఎక్కువగా ఉన్నట్లు లెక్కిస్తారు. భాస్వరం లభ్యస్థాయి తక్కువగా ఉంటే సిఫారసు చేసిన భాస్వరం మోతాదు కంటే 25-30 శాతం భాస్వరం ఎరువులను తక్కువగా  వేయాలి.భాస్వరంను కరిగించే  జీవన ఎరువుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా జీవన ఎరువుల  వలన ఉపయోగాలు అనగా జీవన ఎరువులను వాడడం ద్వారా 25-30 శాతం రసాయన ఎరువులకు  అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చును. అలాగే నేల కాలుష్యం తగ్గి పోషకాల మధ్య సమతుల్యత నెలకొంటుంది. అదేవిధంగా పంట మార్పిడి  గురించి వివరించారు.
పంట మార్పిడి వలన పురుగుల, తెగుళ్ళ ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. నేల సారాన్ని  పెంచుకోవచ్చు. అలాగే వరి పంట సాగును తగ్గించి పప్పుధాన్యాలు నూనెగింజల పంటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది.
దీని వలన నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే పంట పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. 

ఈ అవగోపన సదస్సులో ఏ. డి. ఏ అనిల్ కుమార్  ఏ. ఓ నరేందర్  ఏ. ఇ. ఓ దీపిక, శేఖర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సునీల్ గౌడ్,తదితర రైతులు పాల్గొన్నారు