రాజాపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు...

రాజాపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు...
భారత రాజ్యాంగం నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ దేశానికే తన రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేసి మహనీయులుగా మిగిలిపోయారని పలువురు నాయకులు పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ 130వ  జయంతి సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, తాహసిల్దార్ కార్యాలయం, మండల పరిధిలోని వివిధ గ్రామాల తో పాటు రాజాపూర్ చౌరస్తాలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశం లోని 130 కోట్ల జనాభాకు దారి, దిశ నిర్దేశనం చూపిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన ఎవరు ప్రధాని అయిన, రాష్ట్రపతి అయిన, ముఖ్యమంత్రులు అయిన, ఎంపీ, ఎమ్మెల్యేలు, సర్పంచ్, వార్డు మెంబర్ తో సహా వారు అధికారంలో ఉన్నా చివరికి పాటించాల్సింది రాజ్యాంగాన్ని అని గుర్తు చేశారు. వ్యక్తిగత  అధికారం చేలాయించేందుకు ఇలాంటి ఆస్కారం లేదని,  భారత రాజ్యాంగం మాత్రమే  పరోక్షంగా భారత దేశాన్ని భారత రాజ్యాంగం ద్వారా ప్రజలను పరిపాలించే విధానాన్ని వివరించారు.  భారత దేశంములోని ప్రతి ఒక్కరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బచ్చి రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు మాజీ ఎంపీపీ హన్మ గళ్ళ నర్సింలు,  ఎంపిటిసి అభిమన్యు రెడ్డి, కో ఆప్షన్ అల్తాఫ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, తిర్మలాపూర్  యాదయ్య, మైపాల్ రెడ్డి, వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.