రాజాపూర్ బీటీ రోడ్డు పనుల ప్రారంభం....ఎమ్మెల్యే ను సన్మానించిన నాయకులు......
బీటీ రోడ్డు పనుల ప్రారంభంఎమ్మెల్యే ను సన్మానించిన నాయకులు......
రాజాపూర్ మండల కేంద్రం నుండి మోత్కూల కుంట తాండ, మర్రి భాయి తాండ వరకు బిటి రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని సన్మానించారు. మండల కేంద్రంలోని రెయిన్బో హోటల్ ఆవరణలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని కలిసి పనులు ప్రారంభం పట్ల ధన్యవాదాలు తెలియజేసినట్టు సర్పంచ్ రవి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ నాయక్, బాలిశ్వర్, రాములు, సేవ్య లక్ష్మణ్, రమేష్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.