రాజాపూర్ మండలలో 12వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక ...
రాజాపూర్ మండలలో 12వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక ...
2019 జనవరి 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో మండలం లోని 24 గ్రామ పంచాయతీలకు గాను ఒండ్రుమట్టి తరలింపు, బండ్ ప్లాంటేషన్, స్మశానవాటికల నిర్మాణము, సగ్రిగేషన్ షెడ్ల నిర్మాణము, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం 5కోట్లు 57 లక్షల రూపాయల ఖర్చు చేయడం జరిగింది.అందుకు సంబంధించిన పనులను సామాజిక తనిఖీ బృందం ఎస్.ఆర్.పిలు, డి.ఆర్.పిలు, వి.ఎస్.ఎలు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గత 15 రోజులుగా గ్రామాలలో కూలీ కుటుంబాలతో మాట్లాడి ఎం.బి బుక్ లో నమోదు చేసిన కొలతలకు పని ప్రదేశంలో ఉన్న కొలతలకు సరి చూసుకోవడం ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.అదేవిధంగా మండలంలో ఖానాపూర్ గ్రామపంచాయతీ 42,84,780/- రూపాయలు ఖర్చు చేసి మండలంలో మొదటి స్థానంలో, నిలవగా,36,37,647/- రూపాయలు ఖర్చు చేసి రెండవ స్థానంలో తిర్మలాపూర్ గ్రామపంచాయతీ నిలిచిందన్నారు.మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ఆర్థికపరమైన అవకతవకలు జరగలేదని సామాజిక తనిఖీ వారు తెలిపారు అదేవిధంగా క్యాలిక్యులేషన్అ వకతవకలు మొక్కలు ఎండిపోయిన చిన్న చిన్న పొరపాట్లు జరిగాయన్నారు.అందుకుగాను 22 వేల రూపాయలు జరిమానా రూపకంలో రికవరీ చేయాలని అడిషనల్ డి ఆర్ డి ఓ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో లో ప్రజా ప్రతినిధులు, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ఎస్.టి.ఎం సాయి జ్ఞానేంధర్, సోషల్ ఆడిట్ ఎస్.ఆర్.పిలు ఎన్.బద్రు నాయక్ బి.చెన్నకేశవులు అడిషనల్ డి ఆర్ డి ఓ జకియా సుల్తానా, ఏవివో సుతి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏపీఓ లు రాజశేఖర్రెడ్డి, రాజేష్, భారతి, ఈసీ విమల, రాజేందర్, టెక్నికల్ అసిస్టెంట్ లు హారిసింగ్, సుజాత, శివ కుమార్, రమేష్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.