రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం...ఎంపీపి మాధవి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి...
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం...ఎంపీపి మాధవి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి...గాదిర్యాల్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం గండీడ్ మండల పరిధిలోని గాది రియల్ గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపి మాధవి హాజరై వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు దళారులకు అమ్ముకొని వారి చేతిలోమోసపో కూడదనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించడం జరుగుతుందన్నారు రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ప్రతి రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధరపొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రాం రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఎంపిటిసి కోట్ల రాములమ్మ, మండల వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, ఏ ఈ ఓ, మాధురి, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు