రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం...డిఎం జగదీష్ కుమార్

 రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం...రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని డిఎం జగదీష్ కుమార్ అన్నారు ఆదివారం మిడ్జిల్ మండల పరిధిలోని బోయిన్ పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని డిఎం జగదీష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్య పడొద్దని  దళారులను నమ్మొద్దు అని రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిడి బాల ప్రసాద్ తాసిల్దార్ శ్రీనివాస్ పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వీఆర్ఏ శ్రీనివాస్ గౌడ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు