రైతులకు రైతుబంధు రావాలంటే ధరణి పోర్టల్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని తక్షణమే పరిష్కరించాలి ... జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు...

 రైతులకు రైతుబంధు రావాలంటే ధరణి పోర్టల్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని  తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు  ఆదేశించారు.
 సోమవారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి తాసిల్దార్ లతో ధరణిలో పెండింగ్ లో  ఉన్న దరఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.రేపటిలోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని, అప్పుడే రైతులకు రైతుబంధు వస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాసిల్దారులు తక్షణమే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు ప్రారంభించాలని అన్నారు.  ప్రభుత్వం ద్వారా పంపించిన కొత్త చెక్ మెమోలో దరఖాస్తుల  పరిష్కారానికి సంబంధించిన వివరాలను పూరించి పంపించాలని చెప్పారు . ధాన్యం కొనుగోలుకు సంబంధించి తాసిల్దారులందరు మరో నాలుగైదు రోజులు సమన్వయంతో ఒకరికొకరు సహకారం ద్వారా ధాన్యం కొనుగోలు లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియను ముగించాల్సి గా ఆదేశించారు .రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,డి ఆర్ ఓ కే .స్వర్ణలత, తాసిల్దార్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.