రైతుల సంక్షేమం కోసమే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు...

రైతుల సంక్షేమం కోసమే వరి కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు...
వరి కింటాల్ కు మద్దతు ధర ఏ గ్రేడ్ 18 88, బి గ్రేడ్ కు 1868
రైతుల పక్షాన  తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం దే దేవరకద్ర నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  రైతుల సంక్షేమం కోసమే వారికో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అని దేవరకద్ర నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పంపల్లి ముచ్చింతల గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల పట్ల వారి అభివృద్ధి పట్ల కృషి చేస్తున్న కెసిఆర్ వారి అభివృద్ధి కోసం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి మద్దతు ధరను ఏ గ్రేడ్ లో ఇంతవరకు 18 88 రూపాయలతో అదేవిధంగా బి గ్రేడ్ వారికి 18 68 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకు వచ్చేటప్పుడు తాళ్ల ఒడ్లు లేకుండా మట్టి పెద్ద లేకుండా ఆంధ్రప్రభ తీసుకురావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇక్కడ లేని ఈ వరి కోత వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వమే మద్దతు ధర ప్రతి తీసుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కొనుగోలు కేంద్రాల కోసం 30 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రైతులు క్షేమంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అందుకోసమే అనేక సంక్షేమ పథకాలను  పెడుతున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటికీ రెండున్నర కిలోమీటర్ల దూరానికి ఒక చెక్ డాం  నిర్మించడానికి ఇప్పటికే 9మంది చేయడం జరిగిందని కోసం వాటి కోసం భూమి పూజ కూడా చేయడం జరిగిందని త్వరలోనే వాటి పనులను ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా మరో పది నిర్మించేందుకు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ గారికి పంపడం జరిగిందని ఆయన అన్నారు. అలగన సాంక్షన్ అవుతే కోయిల్ సాగర్ డ్యాం నుంచి కురుమూర్తి ఎత్తిపోతల పథకం నుంచి పెద్దమ్మ ద్వారా రైతులకు 24 గంటలు నీరు అందే అవకాశం ఉందని అప్పుడు తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ గా మారుతుందని ఆయన అన్నారు. ఈ విధంగా తెలంగాణ రైతుల కోసం అనేక రకాలుగా ఆలోచిస్తూ రైతులను ఏ రకంగా అభివృద్ధి పరిశీలన ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన ఎవరు కూడా చేయని విధంగా మన ప్రభుత్వం చేస్తుందని రైతుబంధు రైతు బీమా ఇచ్చి వారికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా, ప్రమాదానికి గురైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను అనేక రకాలుగా ఆదుకుంటూ అభివృద్ధి కోసమే పాటుపడుతున్న  అన్నారు. రైతుల రైతుల అభివృద్ధి కోసం ఐకెపి మహిళా సంఘాల ద్వారా కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార కల్పిస్తుందని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంత చేసినా ప్రభుత్వాన్ని మనము మళ్లీ మళ్లీ ఓటేసి గెలిపించుకుని అవకాశం ఉందని మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని మనం కోరుకోవాలని ఆయన అన్నారు. అంతకుముందు తిరుమలాపూర్ గ్రామంలో మా గ్రామాన్ని కౌకుంట్ల మండలానికి మార్చవద్దని మామా గ్రామాన్ని చింతకుంట మండలం లోనే ఉంచాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా దాసరి పల్లి గ్రామంలో ఎస్ డి ఎఫ్ అండర్ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా దాసరి పల్లి గ్రామంలో యూత్ అధ్యక్షులు శేఖర్ కుమార్తె డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు సరిత హర్షవర్ధన్ రెడ్డి, సువర్ణ అశోక్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు కోట రాములు, ఎంపిటిసి మనోహర్రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఉమా మహేశ్వర్ రెడ్డి, గూడూరు సర్పంచ్ కాంతారావు సింగిల్ విండో సీఈఓ లు గోవిందరాజు బషీర్ అహ్మద్ పాండురంగారావు, రైతు కోఆర్డినేటర్ రాజు రెడ్డి మురళి యాదవ్ శాంతి రెడ్డి దేవేందర్ రెడ్డి టి రాజు దశరథ రెడ్డి, జనార్ధన్, గూడూరు నాగరాజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.