రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, నిరుపేద కుటుంబాలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం....
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, నిరుపేద కుటుంబాలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం....
ఉమ్మడి గండీడ్ పరిగి నియోజకవర్గం పరిధిలోని గండీడ్ మండల కేంద్రంలోనీ వివిధ గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తోంది. రైతులు ఇంతకుముందు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కు నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేసి సామాన్య ప్రజలకు అండగా నిలుస్తోంది. తెలంగాణ రాష్టం లో ఎన్నో నిరుపేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మాధవి, జెడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరామొని లక్ష్మీనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.