కోయిలకొండ మండలాన్ని సస్యశ్యామలం చేస్తా .... రైతు కళ్లల్లో ఆనందం చూడడమేనాలక్ష్యం .. రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే....

కోయిలకొండ మండలాన్ని సస్యశ్యామలం చేస్తా     ....                                                రైతు కళ్లల్లో ఆనందం చూడడమేనాలక్ష్యం   ..  రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే....   పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలానికి రైతులకు సాగు నీరు  తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఉన్న పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం , నూతనంగా నిర్మించిన రైతు వేదికను,సేర్ వెంకటాపూర్ లో ఉన్న రైతు వేదికనుఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. దేశ చరిత్రలోనే రైతుల కోసం 24 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కి దక్కింది అని తెలియ జేశారు.32 సంవత్సరాల తర్వాత కోయిలకొండ పెద్ద చెరువు నిండడం తో చెరువు కింద ఉన్న ఆయకట్టు వరి పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి అని తెలియజేశారు. అదేవిధంగా కోయిల్ కొండ మండలం లో 12, 977 ఎకరాలలో వరి పంటను రైతులు వేసుకోవడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బీమా ఇచ్చి ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు . ఈ కార్యక్రమం ఎంపీపీ శశికళ,  జడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పారుపల్లి కృష్ణయ్య,  సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీలు అంజనేయులు, రోజా జగన్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, నాయకులు మల్లయ్య, భీ 0 రెడ్డి, రవి, సాయి రెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు