రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...

 రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయి  అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలంలో లక్ష్మీ పల్లి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు తో పాటు, రైతు బంధు పథకం కింద ఎకరాకు పది వేల రూపాయల పెట్టుబడి, రైతు బీమా  ఇస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక పంటలు పండించిన రాష్ట్రాలుగా పంజాబ్, హర్యానాలు ఉండేవని, కానీ ప్రస్తుతం వాటన్నిటిని తుడిచివేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు  సరఫరా చేసే స్థాయికి తెలంగాణ వచ్చిందని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపి  సాగునీరు అందిస్తామని ఆయన వెల్లడించారు.  ప్రతి గ్రామంలో రైతు వేదిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రాలు ,ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు, ట్రాక్టర్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉచిత విద్య తో పాటు, హాస్టల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని అన్నారు.వ్యవసాయ అధికారులు వారానికి ఒకసారి రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇవ్వాలని, అధిక దిగుబడులు   సాధించేలా వారిని చైతన్యవంతం చేయాలని, గ్రామాలలో అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పిటిసి అన్నపూర్ణ ,రైతు బంధు అధ్యక్షుడు కొండారెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ  ఏ డి యశ్వంత్ రావ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.