రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ......రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎస్ . రాజేందర్ రెడ్డి...

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం   .......                                                రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎస్ . రాజేందర్ రెడ్డి                                  తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం రైతు అభివృద్ధి దశలో ముందుకు సాగాలని కృషి చేస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మండలం లో ఉన్న మల్కాపూర్ , గార్లపాడు, చంద్రాస్ పల్లి, అంకీళ్ళ లో నూతనంగా నిర్మించిన రైతు వేదికల భవనాలను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించుకోవడానికి రైతు వేదికలను నిర్మించడం జరిగిందన్నారు. రైతులకు ఏడాదిలో రెండుసార్లు పెట్టుబడి సాయం అందించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కి దక్కింది అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీ 0 రెడ్డి, జడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి , సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ పారుపల్లి కృష్ణయ్య, నారాయణపేట టిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి, సర్పంచులు నారాయణ యాదవ్, ఆంజనేయులు, గోపాల్, రజిత రవీందర్రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కల్పనాబచ్చి రెడ్డి, రాములు  తదితరులు పాల్గొన్నారు.