పుట్టినరోజు పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉంది.... ఏఎంసి డైరెక్టర్ వనపర్తి దేవేందర్....

పుట్టినరోజు పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా  ఉంది....
ఏఎంసి డైరెక్టర్ వనపర్తి దేవేందర్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, ఏఎంసి డైరెక్టర్ వనపర్తి దేవేందర్ పేర్కొన్నారు. సోమవారం పుట్టినరోజు సందర్భంగా జడ్చెర్ల పట్టణం లోని శ్రీ సత్యేశ్వర ఆశ్రమంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే మండల కేంద్రంలో సర్పంచ్ బచ్చి రెడ్డి, వార్డు సభ్యులు కేక్ కట్ చేసి తినిపించినట్టు తెలిపారు. తన మిత్ర బృందం, పలువురు యువకులు ఏర్పాటుచేసిన కేకులను కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నట్లు పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వనపర్తి దేవేందర్ పేర్కొన్నారు.