పూలే కు పిఆర్టీయు టీఎస్ నేతల నివాళులు...
పూలే కు పిఆర్టీయు టీఎస్ నేతల నివాళులు
గొప్ప సంఘ సంస్కర్త ,
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
మహాత్మజ్యోతి రావు పూలే 194 వ జయంతి వేడుకలు ఆదివారం పిఆర్టీ యు టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ లోని మెట్టు గడ్డ లోని బి.సి.స్టడీ సర్కిల్ ఆవరణలో ఉన్న మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహానికి పిఆర్టీయు టీఎస్ జిల్లా అధ్యక్షులు జి.నారాయణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జి.రఘురాం రెడ్డి, గౌరవ అధ్యక్షులు జి.సుధాకర్ రెడ్డి లు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు అశ్విని చంద్రశేఖర్, ఎల్లయ్య, వైవీ రావు, బుచ్చారెడ్డి, పురుషోత్తం గౌడ్, ఉపేందర్, మదన్ మోహన్ యాదవ్, సురేష్ రెడ్డి, అక్తర్ అహ్మద్, శ్యామ్ బాబు, విజయ్ కుమార్ గౌడ్, ఆంజయ్య, స్వామి వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.