పి యు లో ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అర్హత సాధించిన విద్యార్థులు...

పి యు లో ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అర్హత సాధించిన విద్యార్థులు... 

మహబూబ్ నగర్ టౌన్ మేజర్ న్యూస్:- పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2021 విద్యా సంవత్సరానికి కి అర్హత పొందారు. విద్యార్థులు వారి సమర్థతను నిరూపించుకున్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. ప్రభాకర్ రెడ్డి అర్హత సాధించిన వారి వివరాలను శనివారం నాడు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అరుణ్ కుమార్ రెడ్డి ఆలిండియా   144 వ రాంకు, ఏ. రవి 334, య‌o.అనిల్  కుమార్ 4208 , కె.కీర్తి  4208, శాంతిప్రియ 6084 , బి .హర్షిత 6924 , ఎస్. ప్రవళిక 10022 ,  మరియు బి. కృష్ణవేణి 17507 వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, అర్హత ద్వారా విద్యార్థులు మంచి కళాశాలలో య౦.ఫార్మసీ ప్రవేశం పొంది కన్నవారి కలలు సాకారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసి కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ పిండి పవన్ కుమార్ మరియు ఓఎస్డి టు వి సి మధుసూదన్ రెడ్డి అభినందించారు.