పిఆర్సి ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి భూత్పూర్ మండల పిఆర్టియు శాఖ అభినందనలు ..
పిఆర్సి ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి భూత్పూర్ మండల పిఆర్టియు శాఖ అభినందనలు ..సోమవారం గౌరవ ముఖ్యమంత్రి పదకొండవ పిఆర్సి 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించినందుకు గాను, వయో పరిమితి 61 సంవత్సరాలు పెంచినందుకు గాను, బూత్ పూర్ పిఆర్టియు మండల శాఖ వారి ఆధ్వర్యంలో , భోజన విరామ సమయంలో, స్వీట్స్ పంచుకుని బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఇచ్చిన మాట ప్రకారం prc వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచినందుకు గాను, మరియు cps ఎంప్లాయిస్ ల ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పించినందుకు గాను, భూత్ పూర్ మండల పిఆర్టియు శాఖ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తమ పట్ల ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు ఎస్ .బాల్ రాజు గౌడ్ ,
ప్రధాన కార్యదర్శి v.యాదయ్య, స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి Md. కాజా, మండల కార్యవర్గ సభ్యులు
రామ్ రెడ్డి, నరేందర్, బాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ,బాలాజీ, అమానుల్లాఖాన్, ఉపాధ్యక్షులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.