పిఆర్సి ప్రకటించడం తో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులు

 పిఆర్సి ప్రకటించడం తో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగ  ఉపాధ్యాయులు

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించడంతో మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే వయో పరిమితిని పెంచడం హర్షించదగ్గ విషయమని  వారు పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఎం పి పి సుశీల రమేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటుందని వారి యొక్క కోరికలు తీరుస్తుందని ఆమె అన్నారు అనంతరం ఎంపీడీవోలక్ష్మీదేవి మాట్లాడుతూ 30% ఫిట్మెంట్ పెంచడం చాలా సంతోషం దగ్గ విషయమని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ  చాలా సంతోషంగా  ఉన్నారని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు