పీఆర్సీ ప్రకటనతో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం.

 పీఆర్సీ ప్రకటనతో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం.               ఉద్యోగులకు 30 శాతం పిఆర్సి ప్రకటించడం పట్ల టీఎన్జీవో నియోజకవర్గ అధ్యక్షులు తిరుపతయ్య తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో సోమవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షులు తిరుపతయ్య మాట్లాడుతూ ఉద్యోగుల గొంతుకగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ఆయన కొనియాడారు తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సి, వయోపరిమితి 61 సంవత్సరాలు పెంచినందుకు మరియు ఉద్యోగస్తులకు అంతర్గత జిల్లా బదిలీలకు ప్రకటన చేసిన ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారికి ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు ఆయనకు రుణపడి ఉంటారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో సాయి లక్ష్మి ఎంపీడీవో అనురాధ రెవిన్యూ సిబ్బంది గిర్డవార్ రామాంజనేయులు వి ఆర్ వో లు తాయప్ప విజయ్ కుమార్ వీఆర్ఏలు శ్రీనివాస్ గౌడ్ కర్ణాకర్ కార్యాలయ సిబ్బంది శ్రీరామ్ చెన్నయ్య మల్లేష్ రవి తదితరులు పాల్గొన్నారు