ప్రతి ఒక్కరూ మాస్కు వాడితే కరోనావ్యాప్తిని అరికట్టవచ్చు....

 ప్రతి ఒక్కరూ మాస్కు వాడితే కరోనావ్యాప్తిని అరికట్టవచ్చు....

మహబూబ్ నగర్ టౌన్ మేజర్ న్యూస్:- గత సంవత్సరం మార్చి నుండి కరొణ వైరస్ విజృంభించిన నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మార్గదర్శకాలు విడుదల చేశాయి .లాక్ డౌన్ ఎత్తివేయడంతో మన జీవనం మళ్లీ తమ విధుల నిర్వహణలో నిమగ్నమయ్యారు. కానీ ప్రజలు అప్రమత్తతో ఉంటే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని విశ్లేషకుల సమాచారం. ప్రతి ఒక్కరూ బయటికి వచ్చినప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఉపాధ్యాయులు మాస్కు తప్పని సరిగా ధరించి కరోనా బారిన పడకుండా ఉండాలి.    కరోనా వైరస్ నేపథ్యంలో అంతా ఇప్పుడు ఫేస్ మాస్క్ లను ధరించాల్సి వస్తున్నసంగతి తెలిసిందే. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండేందుకు వీటిని ధరించడం తప్పనిసరి కానీ అతిగా మాస్కులు ఎక్కువ సమయం ధరించి ఉండటం కూడా అంత మంచిది కాదు. మాస్క్ వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా మాస్కులు ధరించి నట్లయితే చర్మం రాపిడికి గురవుతుంది. ఫలితంగా దురద, దద్దుర్లు ఏర్పడతాయి.  అలాగే ఇన్ఫెక్షన్లు చర్మం పై దాడి చేయవచ్చు. మాస్కు శుభ్రంగా లేకపోతే శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి .ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. 
.....మాస్కుల వల్ల వచ్చే సమస్యలు.....
*మాస్క్ ఎక్కువసేపు ధరించే వారిలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. *చిన్న పిల్లలు ఎక్కువసేపు మాస్కులు ధరించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు .వారి ముఖం పై దద్దుర్లు వస్తున్నాయి మార్పు వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారని దీనివల్ల గుండె పై ప్రభావం ఉంటుందన్నారు. *మాస్కులు అతిగా ధరిస్తే నిమోనియా ఏర్పడే ప్రమాదం ఉంది. *రెండు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాత్రమే ఫేస్ మాస్కులు ధరించాలని అమెరికా వెల్లడించింది. *చర్మ అలర్జీలు ఉన్నవారు మాస్కులతో మరింత జాగ్రత్తగా ఉండాలి వాటిని అలాగే వదిలేస్తే శాశ్వత మచ్చలుగా మిగిలిపోతాయి . *ముఖానికి ఎక్కువగా చెమట పడితేదు  తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి మాస్కు పెట్టుకునే ముందు ఆయిల్ ఫ్రీ క్రీమ్ను , లేదా వాస లిన్ రాసుకోవాలి.ఎన్ 95, 99 కాటన్ మాస్కులు  సురక్షితం. ఇళ్లలో తయారు చేసుకునే మాస్కులు కూడా మంచివే.
* ఫేస్ క్రీమ్ రాసిన 20 నిమిషాల తర్వాత ముఖానికి మాస్కు పెట్టుకోవడం మంచిది. మాస్క్ వల్ల మంట ఎక్కువగా ఉన్నట్లయితే యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. మాస్కు తీసిన వెంటనే చేతులతో ముట్టుకోవద్దు. మాస్కు తీసిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి .ఆతర్వాత సబ్బు తో కానీ, ఫేస్ వాష్ తో ముఖాన్ని కడగాలి.  మాస్కు తీసిన తర్వాత  చర్మంపై ముడతలు మచ్చలు ఏర్పడతాయి.
* మాస్కులు వాడి తీసినప్పుడు యాంటీబ్యాక్టీరియల్ లోషన్ లో లేదా లేదా సబ్బుతో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వల్ల కరొణ బారిన పడకుండా ఉంటారు.