ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనేదే అంబేద్కర్ ఆశయం....

ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనేదే అంబేద్కర్ ఆశయం....
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళు అర్పించాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆయన చేరువ ద్వారానే అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న గ్రామపంచాయతీలు ఏర్పడితేనే అభివృద్ధి చెందుతుందని ఆనాడు అంబేద్కర్ అన్నాడు. అందువల్లనే ఎన్నో బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంన్నామని అన్నాడు. అన్ని మతాలకు,అన్ని కులాలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంస్కరణలు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనేది అంబేద్కర్ యొక్క ఆశయం. అందరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశం జనాభాలో రెండో స్థానంలో ఉన్న చదువులో ఏదో ఒక మూలన ఉంది అందుకే అందరికీ విద్య అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నాడు. అదే విధంగా ప్రతి ఒక్క నాయకులు పిల్లలను దత్తత తీసుకొని చదివించాలన్నాడు. ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు ఆయన ఆశయ సాధన లో నడవాలి అన్నాడు. ఈ జయంతి ఉత్సవాలల్లో మండల జెడ్ పి టి సి మాచారం శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిరమోని లక్ష్మీనారాయణ, ఎంపీపీ మాధవి రాజ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వర గౌడ్, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది. గండీడ్ మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.