ప్రతి వ్యక్తి ప్రమాద భీమ తప్పనిసరిగా చేసుకోవాలి ...ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ క్రాంతి కుమార్..

 ప్రతి వ్యక్తి ప్రమాద భీమ తప్పనిసరిగా చేసుకోవాలి

ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ క్రాంతి కుమార్
ప్రతి వ్యక్తి తప్పనిసరిగా  ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఏపీజీవీబీ బ్యాంక్ మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్ క్రాంతికుమార్ అన్నారు శుక్రవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన మిడ్జిల్ మండలం వల్లపురావు పల్లి చెందిన యాదయ్య వల్లభరావు పల్లి కి చెందిన నాగయ్య గౌడ్ ఇరువురు ఏపీజీవీబీ బ్యాంకు లో సంవత్సరానికి 500 చొప్పున ప్రమాద బీమా చేసి ఉన్నందున ఇరు కుటుంబాలకు చెరో పది లక్షల రూపాయల చొప్పున మంజూరైన బీమా డబ్బుల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి బీమా ఇన్సూరెన్స్ లు తప్పనిసరిగా తీసుకోవాలని అనుకోని పరిస్థితిలో ప్రమాదం సంభవించి కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి సమాజంలోని ఎవరు కూడా ఆదుకోవాలని కేవలం బీమా డబ్బుల ద్వారానే ఆ కుటుంబం కుట్టు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి బీమా యోజన ద్వారా సంవత్సరానికి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కడితే సాధారణ మరణం పొందిన రెండు లక్షల రూపాయల బీమా డబ్బులు వర్తిస్తాయి అని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ ల పై ఉన్న అపోహలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బీమా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మాధవరెడ్డి మిడ్జిల్ బ్యాంక్ మేనేజర్ ఊరుకోండయ్య బ్యాంక్ సిబ్బంది ఆంజనేయులు తేజ్ పాల్ రెడ్డి మంజుల రాజేందర్  మసయ్య తదితరులు ఉన్నారు