ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలి ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్...

ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి పై బహుళ వరుసలలో మొక్కలు నాటడాన్ని  ప్రారంభించారు. రాబోయే వారం పది రోజుల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో హరిత హారం కింద జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో  మొక్కలు నాటడం,నర్సరీల పెంపకతో పాటు 99 శాతం సంరక్షణకు చర్యలు తీసుకోవటమే కాక  మహిళా సంఘాలు 2 కోట్ల విత్తన బంతులు తయారు చేస్తున్నారని  తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కట్టే ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలని, మున్సిపాలిటీ కూడా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా చూడాలన్నారు.పట్టణంలో ఎన్నో పార్కులను ఏర్పాటు చేశామని, వాటిని అందంగా తీర్చి దిద్దాలని,  అదేవిధంగా బై పాస్  చుట్టూ, మధ్యలో కూడా మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మొక్కలు నాటారు. స్థానిక సంస్థలకు అదనపు  కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నరసింహులు,డి సి సి బి ఉపాధ్యక్షులు వెంకటయ్య, కౌన్సిలర్ వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .