ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.... ట్రాఫిక్ సీఐ అశోక్ గౌడ్....

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.... ట్రాఫిక్ సీఐ అశోక్ గౌడ్....

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరచూ శానిటైజర్ వాడాలని సబ్బుతో చేతులు అరగంటకు ఒకసారి శుభ్రం చేసుకోవాలని, కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ అశోక్ గౌడ్  వాహనచోదకులకు సూచించారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు మల్లికార్జున ఎంటర్‌ప్రైజెస్ చౌరస్తా తదితర   ప్రాంతాలలో వాహనచోదకులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నగర డీఎస్పీ శ్రీధర్  పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని సూచించారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం వీడాలని మాస్కు తప్పని సరిగా ధరించాలి తరచూ చేతులు అరగంటకి ఒక్క సారి శుభ్రంగా కడుక్కోవాలినీ తరచూ శానిటైజర్ వాడాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.