ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలి ......జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారాం....

ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలి  ......జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారాం.... గ్రామ గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కరోనా వ్యాధి అరికట్టడానికి టీకా వేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారాం తెలిపారు . శుక్రవారం  మండలం లో ఉన్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో covid - 19 బాధితులకు 50 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని  జాయింట్ కలెక్టర్ సీతారామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వ్యాధి గురించి ప్రజలు ఎవరు భయపడకుండా ఆరోగ్యం విషయంలో ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ధైర్యంగా ఉన్నప్పుడే ప్రజలకు ఏ రోగము దరిచేరదని సూచించారు. ప్రజలు మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బాధితుల కోసం 4 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీ 0  రెడ్డి , జెడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి , సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ గౌడ్, ఎమ్మార్వో ప్రకాష్, ఎంపీడీవో రాఘవ, కోయిలకొండ సర్పంచ్ కృష్ణయ్య, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.