ప్రతి మనిషి సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి వీ . శ్రీనివాస్ గౌడ్ ...

ప్రతి మనిషి సేవాభావాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.  శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ లోని ఎంబీసీ చర్చి ఆవరణలో లార్డ్స్ చర్చి ఆధ్వర్యంలో రాజ్ ప్రకాష్ పాల్ ద్వారా కరోనా నియంత్రణకు  జిల్లాకు ఐసోలేటెడ్ ఐ సి యూ, ఆక్సిజన్ లతో రూపొందించిన 2 బస్సులను మహబూబ్ నగర్ కు కేటాయించగా మంత్రి ప్రారంభించారు. ఎంతో మంది క్రైస్తవులు నర్సులుగా పని చేస్తూ సేవ చేస్తున్నారని  మంత్రి అన్నారు. కరోన సమయంలో రాజ్ ప్రకాష్ పాల్  లార్డ్స్ చర్చ్ ద్వారా అందించిన ఐసొలేషన్ ఆక్సిజన్ బస్సులను పల్లె ప్రాంతాలలో వినియోగించాలని, 5,6  కేసులు ఉన్నచోట వీటిని ఉపయోగించాలని  సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా రాబోయే రోజుల్లో మెడికల్  హబ్ గా మారనుందని , 2014 లో మహబూబ్నగర్లో ఏలాంటి ఐసియు, వెంటిలేటర్ ఉండేది కాదని ,ఇప్పుడు జిల్లా కేంద్రంలో 550  పడకలతో పాటు,ఆక్సీజన్, 60 వెంటిలేటర్లు ఉన్నాయని,   వైద్యం కోసంఇతర ప్రాంతాల నుండి  మహబూబ్ నగర్ వస్తున్నారని అన్నారు. మెడికల్ కళాశాల,కు నర్సింగ్ కళాశాల మంజూరైంది,400 ఎకరాలలో ఐ టి పార్క్ నిర్మాణంలో ఉందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ కే.సీ. నరసింహులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శామ్యూల్, ఫాథర్ రెవరెండ్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కుమార్ ప్రదీప్ కుమార్, ప్రజారోగ్య శాఖ ఈ ఈ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.