ప్రశ్నించినందుకే కక్షగట్టారు....బీసీలపై కక్ష కట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం...
ప్రశ్నించినందుకే కక్షగట్టారు....బీసీలపై కక్ష కట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం...బి. సి, నాయకులు,యస్. తిరుపతి కేసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల పై కక్ష కట్టి దౌర్జన్యంగా వ్యవరిస్తుందని మండల బీసీ సంఘాల నాయకులు మండల కేంద్రంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈటెల రాజేందర్ ని మంత్రి పదవి నుంచి తొలగించడం అవమానించడం పై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు మండల కేంద్రంలో సీనియర్ నాయకులు తిరుపతి అధ్యక్షతన ధర్నా నిర్వహించి రాస్తారోక చేయాలని నిర్ణయించారు సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా జరగకుండా ముందస్తుగానే అదుపులోకి తీసుకొని బీసీ సంఘాల నాయకులను p. s. కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచి పై విడుదల చేశారు .పెద్దఎత్తున ధర్నాలు ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని భావిస్తే కరోనా ఉండడంతో కొద్ది మంది తోనే ధర్నా చేయడం ప్రారంభించారు. పోలీసులు వాల ప్రయత్నాన్ని వమ్ము చేశారు.ఈ కార్యమంలో, బీసీ సేన జిల్లా అధ్యక్షులు కురువ శ్రీనివాస్ గణేష్ గౌడ్ దత్తాత్రేయ చాకలి యాదయ్య భోజనం పేట్ గిరి అమ్మపల్లి గోవర్ధన్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు