ఆదివారం నాడు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని పాలమూరు విశ్వవిద్యాలయం లోని ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు మొక్కలు నాటారు

 ఆదివారం నాడు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని పాలమూరు విశ్వవిద్యాలయం లోని ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు మొక్కలు నాటారు. అదేవిధంగా ఈరోజు మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మొక్కలకు నీరు ఆధారం అయితే- మానవాళికి మరియు జీవ వైవిధ్యానికి నీరే ప్రాణాధారం అని అన్నారు .నీటిని పొదుపుగా వాడుకొని రాబోవు తరాలకు కూడా నీరు అందించే బాధ్యత ప్రతి పౌరుడి పై ఉందని తెలియజేశారు.