సుమారు 30కిలోమీటర్ బ్యాక్ స్విమ్మింగ్ ఎక్సపెడిషన్ ను సాధించిన హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్విమ్మర్ గో లి శ్యామల.... అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్....

 

 
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్విమ్మర్ శ్రీమతి గోలి శ్యామల శ్రీలంక లోని తలైమన్నార్ ప్రాంతం నుండి ధనుష్ కోడి ఇండియా ప్రాంతం వరకు సుమారు 30 కిలోమీటర్ల ప్లే బ్యాక్ స్విమ్మింగ్ ఎక్సపెడిషన్ ను సాధించినందుకు హైదరాబాద్ లోని తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారన్నారు. అందులో భాగంగా తెలంగాణ కు చెందిన గోలి శ్యామల గారు 47 వ వయస్సులో శ్రీలంక లోని తలైమన్నార్ ప్రాంతం నుండి ధనుష్ కోడి ఇండియా ప్రాంతం వరకు సుమారు 30 కిలోమీటర్ల ప్లే బ్యాక్ స్విమ్మింగ్ ఎక్సపెడిషన్ లో పాల్గొని విజయం సాధించిన మహిళలలో ప్రపంచంలోనే రెండవ మహిళగా నిలిచినందుకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్ లో స్విమ్మింగ్ లో మరిన్ని ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలనిఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ. అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.