ప్రమాద వషత్తు మంటలు....
ప్రమాద వషత్తు మంటలు....
మండల కేంద్రం సమీపంలోని పెద్ద పల్లి చౌరస్తా వద్ద పారిశ్రామిక వ్యర్థ జలాలను తరలిస్తున్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ట్యాంకర్ క్యాబిన్ మొత్తం నిమిషాల్లో దగ్ధమైంది. ఈ ట్యాంకర్ జ డ్చర్ల పోలేపల్లి పారిశ్రామిక వాడల నుంచి ఓ పరిశ్రమకు చెందిన కాలుష్య కారక జలాలను తీసుకొని హైదరాబాద్ పటాన్చెరు ప్రాంతంలోని వర్త జలాల శుద్ధి కేంద్రానికి ప్రయాణిస్తుంది.
మార్గమధ్యంలో పెద్దపల్లి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని క్యాబిన్ దగ్ధమైంది మంటలు ఆర్పడానికి షాద్నగర్ జడ్చర్ల నుంచి ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పి వేశాయి. అనంతరం క్రేన్ సహాయంతో ట్యాంకర్ను రోడ్డు పక్కన దూరంగా తరలించారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.