ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ..... సర్పంచ్ బి. కృష్ణయ్య .....
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ..... సర్పంచ్ బి. కృష్ణయ్య ..... కరోనా టీ కా వ్యాక్సిన్ వేయించుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోయిలకొండ సర్పంచ్ బి. కృష్ణయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ కరోనా టీకా వేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కరోణ వ్యాధి మహమ్మారిని దరిదాపులకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని తెలిపారు. సర్పంచ్ తో పాటు గ్రామపంచాయతీ కార్మికులు, వార్డు నెంబరులు, మొత్తం 43 మంది క రో నా టీ కా వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో, డాక్టర్ చంద్రశేఖర్ , సెక్రటరీ రమేష్, ఉప సర్పంచ్ కాజా నవాజ్, టి శ్రీనివాసులు, రామస్వామి, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.