ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి....

 ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి....

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ సహాయం చేసి ఆదుకోవాలని బుధవారంనాడు రాష్ట్ర ఆప్కారి, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ట్రస్మా అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు  ఉపాధ్యాయులకు ఇచ్చే ఆపత్కాల సహాయం కింద ప్రభుత్వం ప్రకటించిన 2000 వేల రూపాయలు మరియు 25 కిలోల బియ్యం పథకం ఉమ్మడి జిల్లాలో 36% మంది ఉపాధ్యాయులకు మాత్రమే అందిందని, మిగతా 64% మంది ఉపాధ్యాయులకు అందించాలని మంత్రితో విన్నవించుకున్నారు. ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి ప్రభుత్వము సహాయం చేసి ఆదుకోవాలని  కోరారు. కనీసం రెండవ విడతలో రాష్ట్రంలో 1 లక్ష 36 వేల మంది టీచింగ్, టీచింగ్ స్టాఫ్ లను ఆదుకోవాలని మంత్రితొ విజ్ఞప్తి చేశారు.