ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ ...
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ ... దాత కుమ్మరి రాములును అభినందించిన జాయింట్ కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ టీచర్లకు దాత కాంట్రాక్టర్ కుమ్మరి రాములు ఇచ్చిన సోనా బియ్యంను జాయింట్ కలెక్టర్ సీతారాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కరోన మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని సానుభూతితో 25 కిలోల సన్న బియ్యం ప్రైవేట్ టీచర్లకు వింజమూరు కుమ్మరి రాములు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలియజేశారు . అదేవిధంగా కాంట్రాక్టర్ కుమ్మరి రాములను జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ , జడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస రెడ్డి , ఎమ్మార్వో ప్రకాష్, సర్పంచ్ కృష్ణయ్య, రామన్న పల్లి తండా సర్పంచ్ కె . వెంకట్ బాయ్, వింజమూరు ఉపసర్పంచ్ భీమయ్య, ఎంపిటిసి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.