దిక్కుతోచని స్థితిలో చితికి పోతున్న ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలు....

 దిక్కుతోచని స్థితిలో  చితికి పోతున్న ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలు..... విద్యార్థుల తల్లిదండ్రులా రా ప్రైవేటు పాఠశాలలను ఆదుకోండి

మహబూబ్నగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు 
బి. లక్ష్మణ్
భూత్పూర్ మేజర్ న్యూస్: సూర్య: గత కొంత కాలంగా లాక్ డౌన్ సమయం లో సమయంలో ప్రైవేట్ పాఠశాలలు  ప్రభుత్వ దేశానుసారం అన్ని పాఠశాలలు మూసివేశారు.
 
ఈ సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు కాలేక, విద్యార్థులకు సరైనటువంటి దిశానిర్దేశం చేసుకోలేక ,పాఠశాలల యాజమాన్యం మరియు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీవనం దిక్కుతోచని స్థితిలో ఆగమ్యగోచరంగా మారిపోయిందని మహబూబ్నగర్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు B. లక్ష్మణ్ ఒక ప్రకటన లో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
 
ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో  9వ మరియు 10 వ తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష బోధనలకు అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో ఇదే నెలలో 6వ,7వ,మరియు 8వ తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనలకు  అనుమతినిచ్చింది.
 
కానీ విద్యార్థులు పూర్తి సంఖ్యలో పాఠశాలకు రాలేక పోతున్నారు ,
 
 ఈ సంవత్సరం జీవో నoబర్ 46 రూల్ ప్రకారం ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఆర్డర్స్ ఇచ్చిందని వారు తెలిపారు. . 
 
ఇకపోతే గ్రామీణ 
మరియు మండల స్థాయి లో ఉన్నటువంటి ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల బతుకులు చాలా హీనంగా తయారయ్యాయని,
 
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు 
 తమ  పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ,
సమాజంలో భావి భారత పౌరులు తయారు చేసేటటువంటి గురువులకు విద్యార్థుల యొక్క  తల్లిదండ్రులు వారిని పట్టించుకోవడంలేదని కనీస ధర్మంగా వారికి ఇవ్వవలసిన ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వడం లేదని.
 ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరి వారి పాఠశాలలలో అద్దె భవనాలు కిరాయిలు, కరెంటు బిల్లులు, టీచర్స్ యొక్క జీతాలు, పాఠశాలలో పనిచేసే ఆయాలకు అటెండర్ లకు కనీస మైనటువంటి డబ్బులు ఇచ్చే స్థాయి లో ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ లు నేడు లేరని వారిని ఆదుకోవాలని అటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు నేడు ఆదుకోవడం లేదని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 
కనుక విద్యార్థుల తల్లిదండ్రులు  ప్రైవేటు బడ్జెట్ పాఠశాలల దయనీయ స్థితిని అర్థం చేసుకుని వారిని కాపాడాలని,
 భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే యాజ మాన్యాలు, ఉపాధ్యాయులని   ఆదుకోవాలని ఈ పత్రికా  ముఖంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రకటన చేస్తున్నానని వారు తెలిపారు.
  మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు B.లక్ష్మణ్  ఒక ప్రకటనలో తెలిపారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా  ట్రస్మా గౌరవ సలహాదారులు లక్ష్మణ్ గౌడ్, జిల్లా ట్రస్మా ట్రెజరర్ వేణుగోపాల్, జిల్లా ట్రస్మా ఉపాధ్యక్షులు వంశీ మోహన్ రెడ్డి ,
రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు 
క్రాంతి కుమార్ ,
రాష్ట్ర ట్రస్మా ఇసి నెంబర్ నరేందర్ జి ,వెంకటయ్య , రవీందర్ ర్, వినయ్ కుమార్,శివ కుమార్,కృష్ణ మోహన్, సంపత్ ,శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.