ప్రైవేటు పాఠశాల సిబ్బంది అందరికి లబ్ధి చేకూరాలి ....
ప్రైవేటు పాఠశాల సిబ్బంది అందరికి లబ్ధి చేకూరాలి ....
ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు మరియు బోధనేతర సిబ్బందికి 2000 ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలి. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందిని కూడా ఆదుకోవాలని జిల్లా ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ శనివారం నాడు పత్రికా ప్రకటన ద్వారా కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10,800 మంది దాకా ఉపాధ్యాయులు పని చేస్తున్నారని తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలో సమర్పించే ఉపాధ్యాయుల వివరాల గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ పాఠశాల అధ్యక్షులు ఎన్. ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్. రాంచందర్ జి, పట్టణ అధ్యక్షులు మాధవి, రూపవతి, హరినాథ్ గౌడ్ ,అంజిరెడ్డి పాల్గొన్నారు.