ప్రైవేట్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయం ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్...

 ప్రైవేట్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  బుధవారం మహబూబ్ నగర్  లోని రోడ్లు, భవనాల అతిథి గృహం ఆవరణలో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శానిటైజర్ లు, మాస్క్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.కరోనా సమయంలో జర్నలిస్టు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి వార్తలను సేకరించి సమాజానికి అందించారని అన్నారు. అలాంటివారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీన్ని గుర్తించి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు శాని టైజర్లు, మాస్కులు పంపిణీ చేయటం సంతోషించదగ్గ విషయం అని అన్నారు.   ఈ కార్యక్రమంలోసుశ్రుత ప్రజా వైద్యశాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,నేహ షైన్ ఆసుపత్రి డాక్టర్ విజయ్ కాంత్, మల్లికా హాస్పిటల్ డాక్టర్ మహేష్ బాబు, అనిల్ సర్జికల్ హాస్పిటల్ అనిల్ వట్టేరి, మీనాక్షి హాస్పిటల్ డాక్టర్ రామ్ మోహన్,మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు,తదితరులు పాల్గొన్నారు.