ప్రైవేటు బడులను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి....

 ప్రైవేటు బడులను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి....

 గత సంవత్సర కాలంగా ప్రైవేట్ పాఠశాలలు కరోనా కారణంగా మూతపడ్డాయని బుధవారం నాడు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు 2000 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం అందించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని, మున్సిపల్ టాక్స్ మరియు కరెంటు బిల్లు మాఫీ చేసి ,ప్రతి ప్రైవేటు పాఠశాలకు 5 లక్షల బ్యాంకు రుణాలు ఇప్పించాలని మంత్రి కేటీఆర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు ఎన్. ప్రభాకర్ ,రామ్ చందర్ జి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.