ప్రైవేటు బడుల ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు- ట్రస్మా విజ్ఞప్తి...

  ప్రైవేటు బడుల ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు- ట్రస్మా విజ్ఞప్తి...

 ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఆత్మహత్యలను ఖండిస్తూ, బుధవారం నాడు ట్రస్మా ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలతో మహబూబ్ నగర్ టౌన్ లో నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రైవేట్ కరస్పాండెంట్ మరియు ఉపాధ్యాయులు భారీగా హాజరై నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వారు కొన్ని విజ్ఞప్తులు కూడా చేశారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు నెలకు 10 వేల ఇవ్వాలన్నారు.  పాఠశాలల మున్సిపల్ టాక్స్ ,ఎలక్ట్రికల్ బిల్, 2021 వరకు ప్రభుత్వం మాఫీ చేయాలి అన్నారు. పాఠశాలను  తెరిపించాలని డిమాండ్ చేశారు .ప్రతి పాఠశాలకు ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయల బ్యాంకుల నుండి మంజూరు చేయాలి అన్నారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో చనిపోయిన రవికుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల లో నాలుగు లక్షల 75 వేల మంది ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది ఉన్నారు .అందరికీ ఉగాది వరకు ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జీతాలు లేక 14 నెలల నుండి రోడ్లమీద పడ్డారు. తెలంగాణలో 32 మంది కరస్పాండెంట్ మరియు టీచర్స్  ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.