ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర.. జెడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి...

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర.. జెడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి...
 కొమిరెడ్డి పల్లి లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.. కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని  ప్రభుత్వ వరికొనుగోలుకేంద్రాలనుసద్వినియోగంచేసుకోవాలని జడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో పి ఎ సి ఎస్  ఆధ్వర్యంలోవరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకుని  మోస పోకూడదని ప్రతి రైతు మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ప్రతి రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఉప సర్పంచ్ రాజు, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఏఈవో లక్ష్మీకాంత్, పిఎసిఎస్ సిబ్బంది , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు