ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగినందునే నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారు ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...

 ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగిందునే నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.బుధవారం ఆయన మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ డియాగ్నిస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్  కేంద్రంలో ఇంకా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ డియాగ్నోస్టిక్ కేంద్రంలా  తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ డయాగ్నొస్టిక్ కేంద్రంలో హార్ట్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్ , లిపిడ్ ప్రొఫైల్ వంటి అన్ని రకాల టెస్టులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రం ద్వారా పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడే ఇవ్వాలని, ఫలితాలను డిజిటలైజేషన్ చేయాలని, నమూనాల సేకరణ ఫలితాల విషయంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఫలితాలను తక్షణమే సంబంధిత రోగులకు వారి వాట్సాప్ కు పంపించే ఏర్పాటు చేయాలని,   ఫలితాల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని, ఫలితాలను పర్యవేక్షించేందుకు ఒక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని, అంతేకాక తెలంగాణ డయాగ్నొస్టిక్ వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.  మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్ల ,నర్సులు,సిబ్బంది సంఖ్య పెరిగిందని,500 పడకలు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇటీవల 150మంది హౌస్ సర్జన్లు సేవలందిస్తున్నరని ఇకపై నిరంతరం 300 మంది డాక్టర్లు ఆస్పత్రిలో సేవలు అందించే అవకాశం ఉందన్నారు.  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అన్ని జిల్లాల నుండి  వైద్యం కోసం వస్తున్నారని, అంతేకాక ప్రత్యేకించి హైదరాబాద్ నుండి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నట్లు మంత్రి వెల్లడి వెల్లడించారు.మహబూబ్ నగర్ జిల్లా ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై వారంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని, టెండర్లను పిలిచి  కాలువల నిర్మాణం చేపడతామని,కాలువల ద్వారా చేరువులన్ని నింపుతామని మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయని, ఒక ఛాలెంజ్ గా తీసుకొని మహబూబ్ నగర్ ను  అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. జిల్లాలో కరోన  మొదటి, రెండవ దశల్లో కూడా  ప్రజా ప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్లి సేవలు అందించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు మాట్లాడుతూ పేద ప్రజలకు  అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో వైద్య రంగంలో  సౌకర్యాల కల్పన విషయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ అభినందనీయమని అన్నారు. జిల్లా ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కె. సి. నరసింహులు,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రాం కిషన్,  మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ ,డి ఎం హెచ్ ఓడాక్టర్ కృష్ణ ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ,ఆర్ ఎం ఓ డాక్టర్ జీవన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్,  అనంతరెడ్డి, కౌన్సిలర్ నీరజ,  ఆస్పత్రి సలహా కమిటీ సభ్యులు వెంకన్న, లక్ష్మి, మల్లేష్ ,కే పురుషోత్తం రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .