పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక...మండలంలోని మహమ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో 2000 2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం మమదాబాద్ లోని తాము అప్పుడు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అప్పుడు వారి తరగతి గదిలోని వారు కూర్చున్నస్థలం చూసి గుర్తు చేసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు కొంతమంది అప్పటి పూర్వ విద్యార్థులు ఇప్పుడు అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా, ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు తామంతా ఒకే కుటుంబం అనే భావనతో అందరు కలిసి మెలిసి  ఆత్మీయంగా కలుసుకున్నారు.నేత్రదానం చేస్తున్నట్లు తెలిపిన పూర్వ విద్యార్థులు కొంతమంది తాము చనిపోయిన తర్వాత తమ కళ్లను దానంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి  నేత్రదానం చేస్తున్నట్ల అంగీకార పత్రాలు   అందజేసినవారిలో వేణు గౌడ్, దానకరి రవి, అశోక్ ,బాల్రాజ్ తదితరులు ఉన్నారు