ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను ఎప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకుంటున్నామని, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు వివరించిన కలెక్టర్ వెంకట్ రావు

ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను ఎప్పటికప్పుడు  డౌన్ లోడ్ చేసుకుంటున్నామని,ప్రస్తుతం 50శాతం డౌన్లోడ్ చేసుకున్నామని, తక్కిన వాటిని 3,4 రోజుల్లో నూటికి నూరు శాతం డౌన్లోడ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు వివరించారు.శనివారం  చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ శశాంక గోయల్  అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో ఈవీఎంల నిర్వహణ, ఓటర్ జాబితా, ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు,  పోర్టల్ లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, తదితర అంశాలపై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఎప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకోవాలని, ఈవీఎం గోదాము లను షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయడంతోపాటు, నివేదికలు రెగ్యులర్ గాపంపించాలని తెలిపారు.ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ల పై పోర్టల్ లో అందిన  ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడే పరిష్కరించాలని  అన్నారు.ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన బిల్లుల యు.సి లను  పంపించాలని ఆదేశించారు . ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మహబూబ్ నగర్ జిల్లా నుండి  17 బిల్లులను సమర్పించగా ఇప్పటి వరకు 13 యూ సి లు కూడా ఇవ్వడం జరిగిందని ,4 యు.సి లు  వారం రోజుల్లో సమర్పిస్తామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు  కలెక్టర్ కె. సీతారామారావు, డిఆర్ఓ  కె.స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు .